NTV Telugu Site icon

AUS vs PAK; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!

Umpire Stuck In Lift

Umpire Stuck In Lift

3rd Umpire stuck in the Lift during AUS vs PAK 2nd Test: మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ రిచ‌ర్డ్ ఇల్లింగ్‌వ‌ర్త్.. లిఫ్ట్‌లో ఇరుక్క‌పోవ‌డంతో మ్యాచ్‌ కాసేపు నిలిచిపోయింది. లంచ్ త‌ర్వాత ప్లేయ‌ర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంలోకి వచ్చినా.. మ్యాచ్‌ను ఆల‌స్యంగా ప్రారంభించాల్సి వ‌చ్చింది. ఏమైందని అయోమయానికి గురైన ఆటగాళ్లు.. చివరకు విషయం తెలుసుకుని నవ్వులు పూయించారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్‌ అంపైర్లు సిద్దమయ్యారు. అయితే సీటులో థర్డ్ అంపైర్ రిచ‌ర్డ్ ఇల్లింగ్‌వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్‌లు ప్రారంభించలేదు. ఈ విషయాన్ని ఫోర్త్‌ అంపైర్‌కు ఫీల్డ్‌ అంపైర్‌లు చెప్పగా.. అతడు థర్డ్‌ అంపైర్‌ గదికి వెళ్లాడు. ఆ సమయంలో ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్‌లు చెప్పారు. ఆ వెంటనే ఇల్లింగ్‌వర్త్ తన సీటు వద్దకు వచ్చాడు. లిఫ్ట్‌ అపుడప్పుడు సరిగా పనిచేయదని తెలుస్తోంది.

Also Read: Delhi Fog: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 22 రైళ్లు, 134 విమాన సర్వీసుల్లో జాప్యం!

మ్యాచ్‌ను ఎందుకు ఆరంభించడం లేదని మైదానంలోని ప్లేయర్స్ కాస్త అయోమయానికి గురయ్యారు. ఫీల్డ్‌ అంపైర్‌ల ద్వారా విషయం తెలుసుకున్న ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ అయితే పగలపడి నవ్వుకున్నాడు. థర్డ్ అంపైర్ రిచ‌ర్డ్ ఇల్లింగ్‌వర్త్ తన సీట్లోకి వచ్చాక మ్యాచ్ ఆరంభం అయింది. మొత్తంగా 7 నిమిషాల తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Show comments