David Warner scored 57 runs in his final innings: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 75 బంతుల్లో 7 ఫోర్లతో 57 రన్స్ చేశాడు. వార్నర్ సహా మార్నస్ లబుషేన్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. దాంతో వార్నర్‌కు ఆస్ట్రేలియా ఘన వీడ్కోలు పలికింది.
68/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే ఆలౌట్ అయింది.అరంగేట్రం ఆటగాడు సైమ్ అయూబ్ (33) టాప్ స్కోరర్. రిజ్వాన్ (28), జమాల్ (18) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లతో చెలరేగగా.. నాథన్ లయోన్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని.. ఆసీస్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ నిలిపింది. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది.
Also Read: David Warner: నా టోపీలు దొరికాయి.. సాయపడ్డ అందరికీ రుణపడి ఉంటా!
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్ (88), సల్మాన్ (53), జమాల్ (82) హాఫ్ సెంచరీలు చేశారు. పాట్ కమిన్స్ 5 వికెట్లతో చెలరేగాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్ (60) టాప్ స్కోరర్. మిచెల్ మార్ష్ (54), ఉస్మాన్ ఖావాజా (47) రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్స్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 115 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో.. ఆసీస్ సునాయాస విరాజయాన్ని అందుకుంది.