AUS vs PAK: టెస్టులో టీ20 ఇన్నింగ్స్.. డేవిడ్ వార్నర్ సెంచరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner Hits Century in AUS vs PAK 1st Test: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడేస్తుంటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలు, సిక్సులు బాదుతూ.. బౌలర్లపై ఒత్తిడి తెస్తాడు. టెస్ట్ మ్యాచ్ అయినా సరే ఒక్కోసారి టీ20 ఇన్నింగ్స్ ఆడేస్తాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొదటి సెషన్ మొత్తం వార్నర్ దూకుడుగా ఆడాడు. 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు చేశాడు.
అయితే లంచ్ అనంతరం డేవిడ్ వార్నర్ దూకుడు తగ్గించాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తున్నాడు. రెండో సెషన్‌లో ఎక్కువగా సింగిల్స్ తీస్తున్నాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ వేసిన 43వ ఓవర్ ఐదవ బంతికి ఫోర్ బాది మూడంకెల స్కోర్ అందుకున్నాడు. టెస్టులో అతడికి ఇది 26వ శతకం.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: Babar Azam: బాబర్ అజామ్‌ను కాదు.. పాకిస్థాన్‌లో ఎక్కువ సెర్చ్ చేసింది భారత ఆటగాడినే!
డేవిడ్ వార్నర్ కొట్టిన సిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. షాహిన్ ఆఫ్రిది వేసిన బంతిని వార్నర్ వెనకాలకు కొట్టి కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా 48 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్ (109), స్టీవ్ స్మిత్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా (41), మార్నస్ లాబుషేన్ (16) రన్స్ చేశారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉంది. 1995లో కంగారూ గడ్డపై చివరిసారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు కూడా సిరీస్ గెలవలేదు.
David Warner to his critics 👇pic.twitter.com/nJA2fMXNvM
— Johns. (@CricCrazyJohns) December 14, 2023
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!