Nitish Reddy Debut: పెర్త్ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024
- పెర్త్ వేదికగా మొదటి టెస్టు
- నితీశ్ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని.. ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తాడు.
భారత్ యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పెర్త్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టులో నితీశ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో నాలుగో సీమర్‌గా నితీశ్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. పిచ్ పరిస్థితులు నితీశ్ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయట. అంతేకాదు అతడు జట్టులో ఉంటే.. బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. రిషబ్ పంత్ మాదిరి హిట్టింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఇద్దరు క్రీజులో ఉంటే పరుగుల వరద ఖాయం.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
నితీశ్ రెడ్డి ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బంగ్లా సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో 34 బంతుల్లో 74 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లూ కూడా తీశాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. భవిష్యత్ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ను పరిగణిస్తున్న బీసీసీఐ.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో చోటు కల్పించింది. ఇప్పటివరకూ 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 779 పరుగులు, 56 వికెట్లు పడగొట్టాడు. తెలుగు ప్లేయర్స్ వీవీఎస్ లక్షణ్, హనుమ విహారిలు భారత్ తరఫున సత్తాచాటిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?