Dinesh Karthik About Border-Gavaskar Trophy: గత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత సీనియర్ క్రికెటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే కీలక పాత్ర పోషించారు. వచ్చే నవంబర్‌లో మొదలయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వారిద్దరు ఆడడం దాదాపు అసాధ్యమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకొనేందుకు భారత్ సహా ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ కీలకం. ఈ నేపథ్యంలో బలమైన జట్టుతో కంగారో గడ్డపైకి భారత్ వెళ్లనుంది. అయితే పుజారా-రహానే స్థానాల్లో ఎవరు ఆడుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే స్థానాల్లో శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ సరైనోళ్లు అని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్ షోలో డీకే మాట్లాడుతూ… ‘సీనియర్ల స్థానాలను భర్తీ చేయడం కష్టమే. కానీ కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తేనే భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారు. పుజారా, రహానే స్థానాల్లో గిల్-సర్ఫరాజ్ ఆడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. వీరిద్దరూ ఇంగ్లండ్‌పై అద్భుతంగా ఆడారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కూ వీరిద్దరినీ ఎంపిక చేస్తారనుకుంటున్నా’ అని అన్నాడు.
Also Read: Divorce Rumours: ఐశ్వర్య, అభిషేక్ విడిపోలేదు.. ఇదిగో ప్రూఫ్!
నాలుగేళ్ల క్రితం టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్.. ఇప్పటివరకు 25 టెస్టుల్లో 1,492 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లోకి లేటుగా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. మూడు టెస్టుల్లో 200 పరుగులు బాదాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. గిల్ ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడిన విషయం తెలిసిందే.