ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అమ్మకాలు నిర్వహించనుంది. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ పేరుతో ఈ సేల్స్ జరుగనుండగా.. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఆఫర్ సేల్ ఉండనుంది. అంతేకాకుండా.. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఈ ఆఫర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకే అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ లో.. అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
TSRTC Chairman: సీఎం ఇంత పెద్ద సర్ ప్రైజ్ ఇస్తారని నేను ఊహించలేదు..
అన్ని రకాల స్మార్ట్ ఫోన్లకు సంబంధించి.. మంచి ఆఫర్లు ఇవ్వనుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎం14 5జీ, వన్ ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ 11 ఆర్, రియల్ మీ నార్జో 60 ప్రో, గెలాక్సీ ఎం04, వన్ ప్లస్ 11, ఐకూ నియో 7 5జీ, రెడ్ మీ నోట్ 12 5జీ, ఐకూ జెడ్7ఎస్, రియల్ మీ నార్జో ఎన్55, ఐకూ జెడ్ 6 లైట్ వాటి మోడళ్లపై భారీగా ఆఫర్లు రానున్నాయి. అయితే వీటి ధరలను ఇంకా తెలుపలేదు. అయితే ఈ సేల్ లో.. స్మార్ట్ ఫోన్లు తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ల్యాప్ టాప్ లపై 75 శాతం వరకు, స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. అంతేకాకుండా యాపిల్ ఉత్పత్తులు, టీవీలు, రిఫ్రిజిరేటర్లపైనా మంచి ఆఫర్లు ఇవ్వునున్నట్లు తెలుస్తోంది.
అటు ఫ్లిప్ కార్ట్ కూడా ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాకుండా.. పేటీఎం చెల్లింపుల పైనా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉండనుంది. టీవీలు, అప్లయన్సెస్ పై 75 శాతం వరకు డిస్కౌంట్ రానుంది. అయితే ఏ వస్తువుకు ఎంత ఆఫర్లు అనేది.. 3వ తేదీన తెలిసే అవకాశం ఉంది.
