Site icon NTV Telugu

Nizamabad: ఆసుపత్రిలో నర్సుపై అత్యాచార యత్నం కలకలం.. చివరకు..

Nizamabad

Nizamabad

నిజామాబాద్ జిల్లాలో దారుణం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై అత్యాచార యత్నం తీవ్ర కలకలం రేపింది. ఖలీల్ వాడి లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న నర్సు పై ఆసుపత్రి నిర్వాహకుని స్నేహితుడు లైంగిక దాడికి యత్నించాడు. బాధిత నర్సు నిందితుడి నుంచి తప్పించుకుని డయల్ 100కు కాల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాగా అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ కొందరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Exit mobile version