Firing At Golden Temple premises: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై తుపాకీతో దాడి జరిగింది. అయితే, దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వెలుపల ఈ ఘటన జరిగింది. స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, అక్కడున్న వ్యక్తులు తుపాకీ బయటకు తీసి సమయంలో అలెర్ట్ కావడంతో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తప్పించుకున్నారు. కాల్పులకు ప్రయత్నించినా వ్యక్తిని అక్కడి సెక్యూరిటీ వారు పట్టుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు.
Also Read: Pushpa – 2 : ఆ ఇద్దరి BGM వర్క్ ను పక్కన పెట్టిన పుష్ప-2 మేకర్స్
కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పేరు నారాయణ్ సింగ్ చౌదా. అతను దాల్ ఖల్సా యొ పనివాడు అని చెబుతారు. సుఖ్‌బీర్‌పై దాడి చేసేందుకు అతను తన ప్యాంట్‌లోని పిస్టల్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు, ఒక వ్యక్తి అతనిపై దాడి చేసి పట్టుకున్నాడు. బాదల్‌పై దాడి జరిగినప్పుడు మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. ఈ దాడి తర్వాత ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడిలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తృటిలో తప్పించుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Indiramma Housing App: ఇందిరమ్మ ఇళ్ల యాప్ సిద్ధం.. రేపు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్