Site icon NTV Telugu

Hyderabad: బషీర్‌బాగ్‌ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో ఫైల్స్ చోరీకి యత్నం..

Bashirbagh

Bashirbagh

హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్‌ ఉంది. కాగా.. ఆటోలో ఫైల్స్‌ తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వారిని చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు ఆగంతకులు.

Namo Movie: నరేంద్ర మోడీ అనుకునేరు… కామెడీ సినిమా టైటిల్!

మరోవైపు ఈ ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆటోలో ఉన్న ఫైల్స్ ఎవరివి, ఎక్కడివి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version