Bhumana Karunakar Reddy: మరోసారి సీబీఐ విచారణకు అయినా సిద్ధం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాడులు అన్నీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. తాజా పరిణామాలపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి NDDB రిపోర్టులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారని, అయితే సీబీఐ చార్జ్‌షీట్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదని స్పష్టంగా తేల్చిందని భూమన గుర్తుచేశారు. ఈ అంశంలో వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ, జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురు దాడులకు దిగుతున్నాయని విమర్శించారు.
Read Also: Jogi Ramesh: హైకోర్టులో జోగి రమేష్, జోగి రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్..
Also Read
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
నెయ్యి కల్తీ దోంగలంటూ వైఎస్ జగన్, భూమన, వైవీ సుబ్బారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. కానీ, ప్రజలు వాటిని నమ్మడం లేదని భూమన అన్నారు. ప్రజలు నమ్మడం లేదనే నిరాశతోనే ఇప్పుడు వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా కూడా మూడు వేల మందితో దాడులు చేయించారని భూమన మండిపడ్డారు.. రాంబాబు మాట్లాడిన మాటలను మేము సమర్థించడం లేదు.. అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాడులు జరగడం దుర్మార్గం అని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇప్పుడు రాంబాబు, జోగి రమేష్‌లపై వరుస దాడులు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు. 2018లో భోలేబాబా డైరీకి అనుమతులు ఇచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు.
ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు సీబీఐపైనే రివర్స్ ఎటాక్ చేస్తున్నారని విమర్శించిన భూమన, నిజంగా ధైర్యం ఉంటే సిట్‌తో కాకుండా సీబీఐతో మరోసారి విచారణ చేయించుకోవచ్చని సవాల్ విసిరారు భూమన.. విచారణకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు. టెండర్ల నిబంధనలు సరళతరం చేయకముందే కొన్ని కంపెనీలకు అర్హత ఇచ్చిందీ చంద్రబాబే అని ఆరోపించిన భూమన, ఈ అంశాలన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు తిరుపతి రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!