NTV Telugu Site icon

Macherla: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యకు గాయాలు.. మాచర్లలో ఉద్రిక్తత..

Macherla

Macherla

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. తెలుగుదేశం పార్టీ వర్గీయులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.. అంతే కాదు.. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి ఘటనలో.. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి భార్య రమతో పాటు ప్రచారంలో పాల్గొన్న మరికొందరు మహిళలకి స్వల్ప గాయాలు అయ్యాయి.. మరోవైపు.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య దాడిని అడ్డుకుంటున్న వెల్దుర్తి ఎస్సై శ్రీహరి తలకి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఈ గొడవ జరిగిందంటున్నారు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలు కూడా ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్న విషయం విదితమే.

Read Also: Viral Video: ఇలాంటి పూలను పెట్టుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే..