Site icon NTV Telugu

Karnataka: హిందూ అమ్మాయిలతో తిరిగిన ముగ్గురు ముస్లిం అబ్బాయిలపై దాడి

Attack Shadow

Attack Shadow

కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులతో తిరుగుతున్నందుకు ముస్లిం యువకులను దారుణంగా కొట్టారు. మంగళూరు జిల్లాలోని సోమేశ్వర్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం, ముగ్గురు ముస్లిం యువకులు తమ హిందువుల స్నేహితురాళ్లతో కాలక్షేపం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. వీరంతా వైద్య విద్యార్థులే.. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి బాధితుల వివరాలను అడిగారు. ఇంతలో తోపులాట జరగడంతో ముగ్గురు దుండగులు విద్యార్థులపై దాడి చేసి పారిపోయారు.

Also Read : Sri Lalitha Sahasranama Stotram: లలితా సహస్రనామ స్తోత్రం

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో పాటు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అనేక కోణాలో విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరినీ త్వరలో అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read : Lakshmi stotram: ఈ స్తోత్రాలు వింటే సకల సుఖాలు, సర్వ సంపదలు చేకూరుతాయి

కేసు గురించి సమాచారం ఇస్తూ.. మంగళూరు పోలీసు కమిషనర్ కుల్దీప్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 7.20 గంటల సమయంలో స్నేహితుల బృందం (మొత్తం 6) సోమేశ్వర్ బీచ్‌లో ఉన్నట్లు తెలిపారు. కొంతమంది వచ్చి వారి పేరు తదితర వివరాలు అడిగి ముగ్గురు అబ్బాయిలను కొట్టారు. మా పోలీస్ (112) వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్ కుల్దీప్ కుమార్ జైన్ అన్నారు.

Exit mobile version