NTV Telugu Site icon

Karumuri Sunil Kumar: వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి.. ఏలూరులో టెన్షన్‌.. టెన్షన్‌..!

Karumuri Sunil Kumar

Karumuri Sunil Kumar

Karumuri Sunil Kumar: ఏలూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ- టీడీపీ కార్యకర్తలు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. ముసునూరు మండలానికి వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకుల అదే మార్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కారును అడిగించి పలువురు కార్యకర్తలు.. దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రంగాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, సొంగ రోషన్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశంలో హాజరైన వారి వర్గీయులే ఈ దాడికి పాల్పడినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు..

Read Also: Sai Dharam Tej: మెగా హీరోపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం..

ఈ ఘటనపై స్పందించిన ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. కూటమి కమ్మ ఆత్మీయ సమావేశానికి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారని ఆరోపించారు. నా కారుపై దాడి చేసి, రెండు కార్లపై కర్రలతో అద్దాలు ధ్వంసం చేశారు.. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడినుండి వెళ్లిపోయా.. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు. హుందాగా రాజకీయాలు చేయాలి.. కానీ, మా సహనాన్ని పరీక్షిస్తే, మేం తలచుకుంటే ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేరని వార్నింగ్‌ ఇచ్చారు. ఓడిపోతున్నాం అన్న భయంతోనే మా పై దాడులకు పాల్పడుతున్నారు.. దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.