NTV Telugu Site icon

Tamil Nadu : తమిళనాడులో దారుణం.. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య..?

Tamilnadu

Tamilnadu

తమిళనాడులో దారుణం. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, కుటుంబసభ్యులు సూచన మేరకే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ రాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో. శవాగారంలో వద్ద పని చేస్తున్నాడు. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బందువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు తెలిపాడు.

Also Read : Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

దీనికి మోహన్ రాజ్ ఐదు వేల రూపాయలను తీసుకుంటున్నట్లు వీడియో వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులు చేసినట్లు మోహన్ రాజ్ పేర్కొన్నాడు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు మోహన్ రాజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. మోహన్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నెల 18న మోహన్ రాజ్ మద్యం మత్తులో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో వైరల్ గా మారింది. దీంతో ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు 18 మంది నకిలీ డాక్టర్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Astrology : ఏప్రిల్‌ 22, శనివారం దినఫలాలు