NTV Telugu Site icon

ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్​ విత్​డ్రా ఛార్జీలు​..

Atm

Atm

పరిమితికి మించి ఏటీఎం లావాదేవీల కోసం కస్టమర్లకు వసూలు చేసే రుసుములు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ఎటిఎం ఆపరేటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని నగదు ఉపసంహరణ కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని కోరారు. నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) కంపెనీ ఎక్కువ డబ్బును సంపాదించడానికి ప్రతి లావాదేవీకి ఇంటర్‌చేంజ్ ఫీజును గరిష్టంగా రూ.23కి పెంచాలని భావిస్తోంది. ఈ విషయం పై ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లీ జాన్సన్ మాట్లాడుతూ., చివరిసారిగా ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెరుగుదల రెండేళ్ల క్రితం జరిగింది. అలాగే స్లాన్సీ జాన్సన్ మాట్లాడుతూ.. “మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాము. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు చెల్లించే రుసుమును పెంచాలన్న మా అభ్యర్థనపై ఆర్‌బీఐ సానుకూలంగా స్పందించింది. CATMI ఈ రుసుమును రూ. 21 పెంచాలని ప్రతిపాదించగా, మరికొందరు ATM ఆపరేటర్లు దీనిని రూ. 23కి పెంచాలని కోరుకున్నారు. ఇంటర్‌చేంజ్ ఫీజులు పెరిగి చాలా సంవత్సరాలు అయ్యిందని చెప్పారు.

Prashant kishor: ఇండియాలో మరో కొత్త పార్టీ.. అక్టోబర్ 2న ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్

ఏటీఎంలలో రుసుములను పెంచడంపై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. కమీషన్లు పెంచేందుకు ఈ బృందం బ్యాంకులతో మాట్లాడుతోంది. బ్యాంకులు కూడా కమీషన్ పెంచడానికి అంగీకరించాయి. ఈ విషయాన్ని ఏటీఎం తయారీదారి యాజమాన్యాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం లావాదేవీల రుసుమును 2021లో రూ.15 నుంచి రూ.17కు పెంచారు. ఇక ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది రూ.23కి చేరుతుంది.

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్.. భారత్ ఘాటు రిప్లై..

మీరు పరిమితిని మించి ఉంటే., ఎటిఎం రుసుము వసూలు చేయబడుతుంది. సాధారణంగా, ఒక వ్యక్తి ఎటిఎం నుండి నెలకు ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ వంటి 6 ప్రధాన నగరాల్లో, బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఎటిఎంలు నెలకు మూడు ఉచిత లావాదేవీలను అందిస్తాయి. ఈ పరిమితి దాటితే రుసుము వసూలు చేయబడుతుంది.

Show comments