AC Theft From SBI ATM in Punjab: ఇటీవలి కాలంలో దొంగలు ‘ఏటీఎం’ మిషన్‌లను ఎత్తుకెళ్లడం సర్వసాధారణం అయింది. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్‌నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ వింత దొంగతనం జరిగింది. ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీని ఎత్తుకెళ్లారు. ఈ ఫన్నీ ఘటన (ATM AC Robbery) పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్‌లోని మోగా జిల్లా భాఘ్ పట్టణంలో ఉండే ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలోని ఏసీ చోరీకి గురైంది. ఆదివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. ఇద్దరూ ఎస్‌బీఐ ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులో ఒకరు లోపల ఉన్న డస్ట్‌బిన్‌ను తిరగేసి.. దానిపైకి ఎక్కి ఇండోర్ ఏసీ యూనిట్ వైర్లను కత్తిరించేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఏసీని కిందికి దించారు. సాయంత్రం వేళ అయినా.. ఇద్దరూ ఎటువంటి భయం లేకుండా ఆ ఏసీని బైక్‌పై తీసుకెళ్లిపోయారు.
ఏసీని ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఏటీఎంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను ప్రట్టుకుంటామని చెప్పారు. ఇక గతంలో కూడా ఇదే బ్యాంక్‌కు చెందిన బైక్ చోరీకి గురైంది. ఇటీవల మహారాష్ట్రలో తాళం తెరుచుకోలేదని ఏకంగా ఏటీఎం మెషిన్‌నే దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
Also Read: Tomatoes Tulabharam: ఇదేందయ్యో ఇది.. టమాటాలతో తులాభారం! ఎక్కడో తెలుసా?
Also Read: Wimbledon Final 2023: వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జొకోవిచ్.. ఛాంపియన్‌గా యువ సంచలనం అల్కరాస్!