బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000కోట్ల కలెక్షన్స్ సాధింపు దిశగా సాగుతోంది.తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జవాన్ మూవీని అట్లీ తెరకెక్కించారు. జవాన్సినిమా భారీ హిట్ అవటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. బాలీవుడ్‍లో అడుగుపెట్టడంతో అట్లీ పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ అయ్యారు. దీంతో అట్లీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.జవాన్ సినిమా తర్వాత తనకు హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ అట్లీ.జవాన్ వంటి సినిమా చూడలేదని తనతో హాలీవుడ్‍కు చెందిన వారు చెప్పారని ఆయన అన్నారు. “నేను తర్వాత స్పానిష్ సినిమా చేయొచ్చు. వారు నాకు కాల్ చేసి ఒకవేళ మీరు హాలీవుడ్‍లో పని చేయాలనుకుంటే మాకు చెప్పండి అన్నారు.
హాలీవుడ్ నుంచి కాల్ చేసి మేం ఇంతకు ముందు ఇలాందెప్పుడు (జవాన్) చూడలేదనే సరికి దేవుడా అని నేను ఆశ్చర్యపోయాను. ఈ ఐడియా మనకు మాత్రమే పని చేస్తుందని అయితే నేను అనుకున్నా. కానీ గ్లోబల్‍గా కూడా ఇది వర్కౌట్ అవుతోంది” అని అట్లీ తెలిపారు.అయితే అట్లీ కి హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందని అట్లీ చెప్పడంతో కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. చాలా సినిమాలను మిక్స్ చేసి జవాన్ చిత్రాన్ని తెరకెక్కించారని అట్లీని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందంటే మేము నమ్మలేకున్నామని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే, అట్లీ చాలా టాలెంటడ్ అని, హాలీవుడ్ సినిమా చేయగలరని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా, జవాన్ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లాలని తాను అనుకుంటున్నానని, ఈ విషయంపై షారుఖ్ ఖాన్‍తో మాట్లాడతానని అట్లీ ఇటీవల తెలిపారు