Atlee : తరువాత ప్రాజెక్ట్ కోసం ఆ హాలీవుడ్ స్టూడియో తో చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార, దీపికా పదుకొనే,హీరోయిన్ లు గా నటించారు.అలాగే ఈ సినిమాలో ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ ఖాన్ సతీమణి గౌరీఖాన్ భారీ బడ్జెట్‌తో జవాన్ సినిమా ను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా జవాన్ సినిమా తో దర్శకుడు అట్లీ క్రేజ్ కూడా నెక్ట్స్ లెవెల్ కు చేరింది.. జవాన్ సినిమా కు ముందు కేవలం తమిళంలో బిజీగా ఉన్న దర్శకుడు అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీబిజీ అయ్యాడు. అయితే అట్లీ మాత్రం హాలీవుడ్ లో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.
తన తర్వాతి సినిమా కోసం ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం.కాగా ఇండియన్ చిత్రాలలో నటించి ఆ తర్వాత హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే దర్శకులు మాత్రం ఇలాంటి ప్రయత్నం అయితే చేయలేదు. అలాంటి అరుదైన ఫీట్ చేసేందుకు అట్లీ సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు.నాకు దేశం, ప్రాంతం అనే తారతమ్యాలు లేవు. ఈ సందర్భంగా నేను ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. గతంలో దక్షిణాది సినిమా లను ‘సౌత్ మసాలా’ అనేవారు. అది ఏమిటో నాకు అస్సలు తెలియదు. నేను బాలీవుడ్‌లో కూడా చేసింది ఇదే. ఏది మంచి, చెడు అనేది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. హాలీవుడ్‌లో కూడా సినిమాలకు ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవు. రెండు రోజుల క్రితం హాలీవుడ్ స్టూడియోతో కూడా మాట్లాడాను. వారు నన్ను దర్శకుడిగా మాత్రమే గుర్తించారు. నేనెప్పుడూ తమిళ చిత్ర దర్శకుడిగా అయితే అస్సలు ఆలోచించలేదు. త్వరలోనే హాలీవుడ్ లో సినిమా చేస్తాం’ అని అట్లీ చెప్పుకొచ్చారు.
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Tags
- Atlee
- jawan
- Sharukh Khan
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!