Site icon NTV Telugu

Atlas Cycle Attha Garu Petle: కడుపుబ్బా నవ్వించేందుకు వస్తున్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’..

Atlas Cycle Attha Garu Petl

Atlas Cycle Attha Garu Petl

రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా దేశముదురు హీరోయిన్ హన్సిక మోత్వాని లీడ్ రోల్ గా “105 మినిట్స్” అనే సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీతో ఒక వినూత్న ప్రయోగం చేసిన దర్శకుడు రాజా దుస్సా.. ఇప్పుడు తన తదుపరి చిత్రంగా తెలంగాణ యాస భాష నేపథ్యంలో ” అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే ” అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: Pakisthan: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్తాన్ చెత్త రికార్డు..

ఈ సినిమాని ” శ్రీ రామకృష్ణ సినిమా ” బ్యానర్ లో గాలి కృష్ణ నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా నాంపల్లి సోమాచారి, అలూరి రాజిరెడ్డి, రూప కిరణ్ గంజి వ్యవహరిస్తున్నారు. ఈ కథ విషయానికి వస్తే 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటనను తీసుకొని ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్నామని దర్శకుడు రాజా దుస్సా వెల్లడించారు.

Read Also: HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

ఈ చిత్రానికి కెమెరామెన్ గా వేణు మురళీధర్.వి, ఎక్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కార్తికేయ శ్రీనివాస్ (వాసు ) పని చేస్తున్నారు. నటినటుల్ని మిగతా సాంకేతికవర్గాన్ని త్వరలోనే తెలియజేస్తామని చిత్రం యూనిట్ తెలిపింది. డీఓపీ: వేణు మురళీధర్. వి, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: రామ్ వెలిశాల, పీఆర్వో: తేజస్వి సజ్జా, డిజిటల్ మార్కెటింగ్ : హౌస్ ఫుల్ మీడియా, పబ్లిసిటీ డిజైనర్: సుధీర్‌లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.

Exit mobile version