Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసిన వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు
- తాము ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎంకు వివరించిన క్రీడాకారులు
- క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీ, తెలంగాణ,పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు పవన్‌ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను డెప్యూటీ సీఎంకు వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి పత్రాన్ని అందించారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని పవన్ వద్ద క్రీడాకారులు వాపోయారు. క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికేట్లు అంగడి సరుకుగా మారిపోయాయని పవన్‌కు తెలిపారు. ఎటువంటి క్రీడానుభవం లేనివారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని పవన్ దృష్టికి క్రీడాకారులు తెచ్చారు. క్రీడా సంఘాలలో తిష్టవేసిన రాజకీయ నేతల వల్ల క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను కొందరు రాజకీయ నేతలు అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Minister Ramprasad Reddy: మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతాం..
Also Read
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీలయ్యాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయని ఆయన విమర్శించారు. ఏపీలో క్రీడారంగం కూడా అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు, తాను ప్రయత్నిస్తున్నామన్నారు. క్రీడాకారుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. క్రీడలకు వైభవాన్ని తప్పకుండా తీసుకు వస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!