Site icon NTV Telugu

Ather Rizta S: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరి.. 159 కిమీ షురూ.. ఏథర్ రిజ్టా S కొత్త వెర్షన్‌ లాంచ్!

Ather Rizta S 3.7 Kwh

Ather Rizta S 3.7 Kwh

Ather Rizta S: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా S (Ather Rizta S) కు కొత్త వెర్షన్‌ ను విడుదల చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మోడల్‌లో 3.7 kWh పెద్ద బ్యాటరీను అందించారు. దీని ద్వారా ఇది 159 కిలోమీటర్ల IDC రేంజ్ ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ Rizta S మోడల్‌లో కేవలం 2.9 kWh బ్యాటరీ మాత్రమే ఉండేది. దానితో స్కూటర్ 123 కిలోమీటర్ల IDC రేంజ్‌ను మాత్రమే అందించేది. ఇదివరకు టాప్-ఎండ్ Rizta Z మోడల్‌ లో మాత్రం 2.9 kWh, 3.7 kWh రెండింటి ఎంపిక ఉండేది. ఇక ఇప్పుడు, Rizta S కూడా 3.7 kWh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చేసింది. దీనితో వినియోగదారులు టాప్-ఎండ్ మోడల్‌కి వెళ్లకుండా తక్కువ ధరలోనే పెద్ద బ్యాటరీతో అధిక రేంజ్‌ను పొందవచ్చు.
Image (1)
Read Also:F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..

ఇక ఏథర్ రిజ్టా S 3.7 kWh మోడల్‌ ధర విషయానికి వస్తే.. ఢిల్లీలో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.37 లక్షలు. ఇది Rizta Z 3.7 kWh మోడల్ కన్నా తక్కువ ధరలో ఉండడమే కాకుండా, Rizta Z 2.9 kWh కన్నా కూడా చవక ధరలో లభించడం విశేషం. ఈ కొత్త మోడల్‌కి బుకింగ్స్ ఓపెన్ కాగా, డెలివరీలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఇక ఈ ఏథర్ రిజ్టా S 3.7 kWh మోడల్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే..

ఈ ఏథర్ రిజ్టా S 3.7 kWh మోడల్‌ కు ఏథర్ డుయో చార్జర్ ద్వారా 5 గంటలు 45 నిమిషాలు చార్జింగ్ సమయం పడుతుంది. ఇక అదే పోర్టబుల్ ఛార్జర్‌తో 8 గంటలు 30 నిమిషాలు పడుతుంది. ఇక స్కూటీ 7-అంగుళాల DeepView LCD స్క్రీన్ డిస్‌ప్లేగా లభిస్తుంది. ఇందులో ప్రాసెసర్ గా Cortex సిరీస్ ను ఉపయోగించారు. అలాగే 1GB RAM, 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఇక ఈ వేరియంట్‌లో ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో.. ఆటో హోల్డ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, Turn-by-Turn నావిగేషన్, ఫాల్ సేఫ్ ఫీచర్, IP66 వర్షనిరోధిత ధృవీకరణ, 34 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ లభించనున్నాయి.

Read Also:Vallabhaneni Vamsi: వైఎస్‌ జగన్‌ను కలిసిన వంశీ.. అండగా ఉంటామని భరోసా!

ఈ స్కూటర్ Ather గ్రిడ్ ద్వారా దేశవ్యాప్తంగా 3900 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. అలాగే, కంపెనీ అందిస్తున్న Eight70 బ్యాటరీ వారంటీ ప్రోగ్రాం ద్వారా 8 సంవత్సరాలు లేదా 70,000 కిమీ వరకూ వారంటీ పొందవచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ (అన్ని వేరియంట్లలో ఒకేలా) విషయానికి వస్తే.. 4.3 kW పీక్ పవర్, 22 Nm టార్క్, 80 km/h టాప్ స్పీడ్ ఉండనున్నాయి. ఇక కేవలం 4.7 సెకన్లలో 0-40 కిమీ వేగానికి చేరుకుంటుంది.

Exit mobile version