Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ న్యూఢిల్లీలో తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కొణార్క్’ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త వాహనాన్ని రూపొందించారు. ఈ ఈవీ రోజు వారీ ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి అద్భుతమైన రేంజ్, కంఫర్ట్ , ఈజీ మెయింటెనెన్స్‌ను అందిస్తుంది. ఢిల్లీలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999గా నిర్ణయించారు.
ఈ స్కూటర్ ‘కొణార్క్ ఎస్’, ‘జెడ్’ ప్రొడక్ట్ లైన్ల కింద మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. ఇది సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 200 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది. అన్ని వేరియంట్లు ఏథర్ సంస్థకు చెందిన 6వ తరం ‘బెడ్‌రాక్ బ్యాటరీ’ని కలిగి ఉన్నాయి. దీనిపై ఏకంగా 10 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు అంటే ఏది ముందైతే అది వారంటీని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వారంటీ కాలం ముగిసే సమయానికి కూడా కనీసం 70 శాతం బ్యాటరీ హెల్త్ తగ్గకుండా ఉండేలా గ్యారెంటీ ఇస్తున్నారు.
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
రైడర్ల సౌకర్యం కోసం ఇందులో అనేక అధునాతన ఫీచర్లను పొందుపరిచారు. రోడ్డు పరిస్థితులకు తగినట్లుగా బ్రేకింగ్‌ను అడ్జస్ట్ చేసే అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ (AeBS), కీ-లెస్ అనుభూతినిచ్చే మ్యాజిక్-కీ, ఆటోపప్ సీట్ ఓపెనింగ్, ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్ సులభం చేసే ఎయిర్‌వాక్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే.. 14-అంగుళాల ఫ్రంట్ అల్లాయ్ వీల్, 12-అంగుళాల రియర్ వీల్, 1,352 మిమీ వీల్‌బేస్ , లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ భారతీయ రోడ్లకు అత్యంత అనుకూలంగా ఉంటాయి.
ఇంటిగ్రేటెడ్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వచ్చే ఈ స్కూటర్‌ను, ఆప్షనల్ 450W ఛార్జర్ సాయంతో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని సర్వీస్ ఇంటర్వెల్ 10,000 కిలోమీటర్లు లేదా ఏడాదిగా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న ఈవీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏథర్ సంస్థ ఇప్పటికే అక్కడ 11 ఎక్స్పీరియన్స్ సెంటర్లు, 7 సర్వీస్ సెంటర్లు, 273 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి తన నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసింది.
తాజావార్తలు
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!