మార్కెట్ లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ 450S కొత్త వేరియంట్‌ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌లో పెద్ద 3.7 kWh బ్యాటరీ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.46 లక్షలు. ఈ స్కూటర్ 161 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఇది పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. గతంలో ఈ బ్యాటరీ 450X లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ అప్‌గ్రేడ్ తో, IDC-సర్టిఫైడ్ రేంజ్ 450S 2.9 లో 115 కి.మీ నుంచి 161 కి.మీ కి పెరిగింది. లాంగ్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read:Anil Ambani-ED: అంబానీకి మరిన్ని కష్టాలు.. ఆ బ్యాంకులకు ఈడీ నోటీసులు!
ఏథర్ 450S పనితీరులో ఎటువంటి మార్పు లేదు. ఇందులో ఇప్పటికీ 5.4kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 22Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 90kph వేగాన్ని కలిగి ఉంటుంది. ఇందులో స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి వివిధ రైడింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి.
Also Read:Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
బ్యాటరీ అప్‌డేట్ తప్ప, ఏథర్ 450S లోని మిగతావన్నీ మునుపటిలాగే ఉన్నాయి. దాని డిజైన్, ఫీచర్లలో ఎటువంటి మార్పు లేదు. ఇది మునుపటిలాగే 7-అంగుళాల LCD స్క్రీన్ తో వస్తుంది. దీనిలో టర్న్-బై-టర్న్ నావిగేషన్, హిల్-హోల్డ్, ఫాల్ సేఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. కంపెనీ దీనిని కొనుగోలు చేసే వారికి Ather Eight70 వారంటీ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఇది బ్యాటరీని 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ. వరకు కవర్ చేస్తుంది. కనీసం 70 శాతం బ్యాటరీ లైఫ్ కి హామీ ఇస్తుంది. డెలివరీలు ఆగస్టు 2025లో ప్రారంభమయ్యాయి. బుకింగ్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో, Ather డీలర్‌షిప్‌లలో ఓపెన్ అయ్యాయి.
