Atharva : అథర్వ ‘కెసీపీడీ’ వీడియో సాంగ్ మాములుగా లేదుగా..

Whatsapp Image 2023 11 25 At 5.38.31 Pm

Whatsapp Image 2023 11 25 At 5.38.31 Pm

సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అదే జోనర్ లో రూపొందుతోన్న చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం మరియు అనసూయమ్మ సమర్పణ లో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై ఈ చిత్రం రూపొందింది.అన్ని రకాల ఎమోషన్స్‌ కలిపి ఈ చిత్రం తెరకెక్కుతుంది.. ఇక ఈ సినిమా లో కార్తీక్ రాజు హీరో గా నటించగా సిమ్రాన్ చౌదరి మరియు ఐరా  హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ కి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతల పాటి నిర్మించారు. ఈ సినిమా కు విజయ మరియు ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌ గా వ్యవహరించారు.ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అలాగే పాటల కు కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో మంచి బీట్ ఉన్న వీడియో సాంగ్ చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

కేసీపీడీ అంటూ సాగే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఊరి వాతావరణం లో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. ఈ సాంగ్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా శ్రీ చరణ్ పాకాల ఈ పాట ను ఆలపించారు.కిట్టూ విస్సాప్రగడ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది.అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్ మరియు ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు.ఈ సినిమా ను చూసి వారంతా కూడా సినిమాను ఎంతగానో మెచ్చుకున్నారు.. క్లూస్ టీంను ఇంత బాగా ఇదివరకు ఎవ్వరూ కూడా చూపించలేదని కొనియాడారు. మొత్తం గా విడుదలకు ముందే అథర్వ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులలో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంటుంది.. మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

https://youtu.be/0IJjhdsWWWY?si=3GannWMJByTQn1vy