విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. అమ్మవారిని దర్శించుకుని మనస్పూర్తిగా రెండు విషయాలు అమ్మవారిని కోరుకున్నాను.. తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Read Also: Sehar Shinwari: పాకిస్థాన్ నటి మరోసారి బంపర్ ఆఫర్.. ఈసారి న్యూజిలాండ్కు
అమ్మవారు దయ చూపి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, తెలుగు జాతి ముందుండాలని పరితపించిన వ్యక్తిని, త్వరగా విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నాను అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వెల్లడించారు. 100 సంవత్సరాల చరిత్రలో భారత దేశంలో ఎప్పుడు ఇటువంటి కరువు పరిస్థితి లేదు.. రైతులు వ్యవసాయమంతా కరువుతో బాధపడుతున్నారు, సరైనటువంటి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
పశువులకి పశుగ్రాసం కూడా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది అని అచ్చెన్నాయుడు అన్నారు. కరువు బారి నుంచి త్వరగా ప్రజలు బయటపడి కోలుకునే విధంగా శక్తిని ఇవ్వాలని దుర్గమ్మ తల్లిని కోరుకున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి మీద ఎన్ని కేసులు బనాయించిన కడిగిన ముత్యం వలే ఆయన బయటకు వస్తారు అంటూ అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
