ఏపీ హైకోర్టు ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు అని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. దీని వల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవరు అని అచ్చెన్న పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల 52 రోజుల పాటు జైలులో ఉన్నా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతో పాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిధ దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరం అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దాం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని ఆయన తెలిపారు. తిరుపతి పర్యటనను చంద్రబాబు క్యాన్సిల్ చేసుకున్నారు.. రేపు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నారు అని ఆయన వెల్లడించారు. అయితే, అంతకు ముందు రేపు ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని తెలిపారు. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన పార్టీ నేతలతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
Atchannaidu: ఆరోగ్య పరీక్షల కోసం చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్తున్నారు..

Atchannaidu