స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడంతో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమని ఆయన తెలిపారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాటం చేశామన్నారు. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి అని అచ్చెన్న పేర్కొ్న్నారు. కోర్టులను తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి అని ఆయన సూచించారు. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు మండిపడ్డారు.
Read Also: India GDP: రికార్డు బ్రేక్.. 4 ట్రిలియన్ డాలర్లు దాటిన ఆర్థిక వ్యవస్థగా భారత్!
చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారు అంటూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న వెల్లడించారు. ఇక పోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Weight Loss : తిన్న తర్వాత ఇలా చేస్తే చాలు.. పొట్ట దగ్గర కొవ్వు మైనంగా కరిగిపోతుంది..
ఇక, చంద్రబాబు అనారోగ్య సమస్యలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు తర్వాత ఉన్నత న్యాయస్థానం వాదనలు ముగిసినట్లు గురువారం ప్రకటించింది. నవంబర్ 16న తీర్పును రిజర్వ్ చేస్తున్న హైకోర్టు.. ఇవాళ చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు.. కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్‌లో విధించిన షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, ఈ కేసులో చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా.. సీఐడీ తరఫున అదనపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు.