NTV Telugu Site icon

Atchannaidu: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను విడుదల చేయాలి

Atchannaidu

Atchannaidu

ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్ ల అక్రమ అరెస్ట్ దుర్మార్గం అన్నారు. వైసీపీ కేడీలు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్ ల అక్రమ అరెస్ట్ దుర్మార్గం అన్నారు అచ్చెన్నాయుడు.

ఆదిరెడ్డి కుటుబం నీతి నిజాయితీ ఏంటో రాజమండ్రి ప్రజల్ని అడగండి చెబుతారు. జగన్ రెడ్డి ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా భయపడేది లేదు. జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని గోదావరి నదిలో కలిపేంతవరకు విశ్రమించేది లేదు.అరెస్టు చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ నిర్వహిస్తున్న జగదీశ్వరి, జగజ్జనని చిట్స్ నిర్వహణ వ్యవహారంలో వీరిని రాజమహేంద్రవరం కార్యాలయంలోనే విచారిస్తున్నారు. ఉదయం వీరిని అదుపులోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అరెస్టును టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్రంగా ఖండించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యమని తెలిసే జనం దృష్టి మళ్లించేందుకు ఆదిరెడ్డి కుటుంబంపై సీఐడీని వదిలారని ఆయన మండిపడ్డారు. ఈ గల్లీ ట్రిక్స్‌కు ప్రజలు మోసపోరన్న విషయాన్ని తాడేపల్లి సైకో గ్రహించాలని వ్యాఖ్యానించారు. ఆదిరెడ్డి కుటుంబానికి టీడీపీ నేతలంతా అండగా ఉంటామని పట్టాభి తెలిపారు.

Read Also: Swiggy: స్విగ్గీ బాదుడు షురూ.. ఫుడ్ ఆర్డర్‌పై ఛార్జ్.. తొలుత ఈ నగరాల్లోనే అమలు..