NTV Telugu Site icon

Kishan Reddy: దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేలా బీజేపీ పాలన

Kishanreddy

Kishanreddy

Atal Bihari Vajpayee: భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదిన ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. వాజ్ పేయి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవం కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. స్వచ్ఛ భారత్ తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయన జీవిత విశేషాలపై సభలు, సమావేశాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వాజ్ పేయి నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడారు.. నాడు పార్లమెంటులో ఒక్క ఓటు తక్కువ ఉన్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని త్యాగం చేశారు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Covid variant JN.1: దేశంలో 63 కొత్త వేరియంట్ కేసులు.. టాప్‌లో గోవా, తెలంగాణలో కూడా నమోదు..

దేశంలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం చేసేలా పాలన కొనసాగించారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పధకంతో లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించారు.. ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం లో అనేక జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ద్వారా పేదలందరికి కోట్లాది గృహ నిర్మాణాలు చేపట్టారు అని ఆయన గుర్తు చేశారు. అమెరికా, యూకే లాంటి దేశాల బెదిరింపులను లెక్క చేయకుండా ప్రోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించి.. భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ప్రపంచ చిత్రపటంలో నిలిపిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: JC Prabhakar Reddy: తాడిపత్రిలో రోడ్డుపై బైఠాయించిన జేసీ..

పాకిస్థాన్ తో స్నేహహస్తం అందించి ఢిల్లీ నుంచి పాకిస్థాన్ వరకు బస్సులో ప్రయాణం చేశారు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే భారత్ కు వెన్నుపోటు పొడిచి కార్గిల్ లో భారత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్థాన్ తో యుద్థం చేసి ఓడించిన నాయకత్వాన్ని అందించిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి.. వాజ్‌ ‌పేయి గారి ఉపన్యాసం కోసం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆయనో మంచి కవి.. అలాంటి మహానేత మనకు స్పూర్తిధాత.. ఆ మహనీయుడి స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్తూ నరేంద్ర మోడీ సుపరిపాలనను అందిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి చూపిన బాట ఈ తరానికి, యువతరానికి, భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.