Site icon NTV Telugu

Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

Ipl 2026 Rcb

Ipl 2026 Rcb

Mobiles Stolen: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు తీరని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఓ ముఠా, భారీ ఎత్తున మొబైల్ ఫోన్లను చోరీ చేసింది. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.

Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..

అందిన సమాచారం ప్రకారం, కేవలం స్టేడియంలోని ‘P3’ స్టాండ్ నుండే సుమారు 50 – 60 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. ఒక మహిళా బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తన భర్త ఫోన్ ఎలా పోయిందో వివరించింది. మొదటి ఇన్నింగ్స్ సమయంలో నా భర్త నీళ్ల కోసం వెళ్లినప్పుడు ఆయన ఫోన్ కొట్టేశారు. మా ఒక్కరిదే కాదు, అదే సమయంలో అక్కడున్న డజన్ల కొద్దీ ప్రజలు తమ ఫోన్లను పోగొట్టుకుని తీవ్ర ఆందోళన చెందారని ఆమె పేర్కొన్నారు.

దొంగలు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ పని చేసినట్లు తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయంలో ప్రేక్షకులు తినుబండారాల కోసం సీట్ల నుంచి లేచిన సమయాన్ని వారు ఆసరాగా చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు దాదాపు 10 మందికి పైగా మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంతా జట్ల జెర్సీలు ధరించి, ఉచిత టిక్కెట్లతో స్టేడియంలో తిరుగుతూ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇది ఏదో చిన్న దొంగతనం కాదని, ఒక ముఠా పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు.

50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!

ఈ విషయమై స్టేడియం వద్ద ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ అప్పటికే వందలాది మంది క్యూలో నిలబడి ఉండటం చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారీ భద్రత ఉండే స్టేడియంలో ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరగడం బెంగళూరు పోలీసుల వైఫల్యమేనని అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version