America: అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలో ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో యూనివర్సిటీలోకి దుండగుడు ప్రవేశించి.. క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల తర్వాత ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని సిబ్బంది తెలిపారు. దాడి చేసిన వ్యక్తి కాల్పుల అనంతరం వెంటనే బిల్డింగ్‌కు ఉత్తరం వైపున ఉన్న ఎంఎస్‌యూ యూనియన్ భవనం నుంచి బయటకు వెళ్లాడు.
Occult Worship in College Bus: కాలేజీ బస్సులో క్షుద్ర పూజల కలకలం.. అమ్మాయిల కోసమేనా..?
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్యాంపస్‌లోని రెండు భవనాల లోపల కాల్పులు జరిపినట్లు భావిస్తున్న నిందితుడి గురించిన ఫోటోలు. సమాచారాన్ని పోలీసులు తర్వాత విడుదల చేశారు. మరియు సమాచారాన్ని వారు తర్వాత విడుదల చేశారు. అనుమానితుడు నల్లజాతీయుడని, పొట్టిగా ఉండి ఎరుపు రంగు బూట్లు, జీన్ జాకెట్ ధరించాడని. బాల్ టోపీని కూడా ధరించిన చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. అమెరికాలోని అతిపెద్ద విద్యాసంస్థల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి. ఈ క్యాంపస్ దాదాపు 50 వేల మంది విద్యార్థులు చదవుకుంటున్నారు. ఈ కాల్పుల నేపథ్యంలో క్యాంపస్‌లో 48 గంటల పాటు అన్ని తరగతులు, కార్యకలాపాలను రద్దు చేశారు.
https://twitter.com/msupolice/status/1625348771386204161
