Drugs Seized: విదేశాల నుంచి అక్రమంగా తరలించి ఇండియాలో విక్రయించేందుకు కేటుగాళ్లు డ్రగ్స్ ను భారీగా తరలిస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో కేజీల తరబడి డ్రగ్స్ పట్టుబడుతున్న ఆ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా రూ.44 కోట్ల విలువైన మత్తు పదార్థాలను డీఆర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Uttar Pradesh: ఇదేం అరాచకంరా నాయనా..! మేకలు ఇంట్లోకి వచ్చాయని జననాంగాలు కొరికేశాడు..
కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా.. అతని నుండి కొకైన్, హెరాయిన్ ను పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ విలువ రూ. 44 కోట్ల విలువ ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. డ్రగ్స్ ను తరలిస్తున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ముసాఫర్ నగర్ కు చెందిన రాజీవ్ కుమార్ గా గుర్తించారు. 3.5 కిలోల కొకైన్, 1.3 కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Karumuri Nageswara Rao: ఆధార్ తో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయి
కెన్యాలోని నైరోబీ నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా విమానంలో ప్రయాణికుడు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనిపై అనుమానం వచ్చిన అధికారులు.. తనిఖీలు నిర్వహించగా 4.8 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. నిందితుడు అనుమానం రాకుండా తన బ్యాగ్ లో ఉన్న బూట్లు, హ్యాండ్ పర్సులు, హ్యాండ్ బ్యాగులు, పిక్చర్ బోర్డులు మరియు ఫైల్ ఫోల్డర్‌లో తరలిస్తుండగా పట్టుబడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.