NTV Telugu Site icon

Asus Rog Phone 9: ‘ఆసుస్‌’ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌, ధర బెదుర్స్!

Asus Rog Phone 9

Asus Rog Phone 9

గేమింగ్ ప్రియుల కోసం తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఆసుస్‌’ తన రోగ్‌ సిరీస్‌లో మరో కొత్త 5జీ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. ‘రాగ్‌ ఫోన్‌ 9’ను గ్లోబల్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసుస్‌ సన్నాహాలు చేస్తోంది. నవంబర్‌ 19వ తేదీన రాగ్‌ ఫోన్‌ 9 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. భారత్‌లోనూ ఈ ఫోన్‌ను ఆసుస్‌ లాంచ్ చేయనుంది.

ఆసుస్‌ రాగ్‌ ఫోన్‌ 9కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌ 6.78 ఇంచెస్‌తో కూడిని ఫుల్‌హెచ్‌డీ కూడిన ఎల్టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 185Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఇది క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అప్ గ్రేడెడ్ అనిమీ విజన్ ఫీచర్‌ను ఇస్తున్నారు. అంతేకాదు ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో తీసుకొస్తున్నారు.

Also Read: Game Changer Teaser: ‘గేమ్ ఛేంజర్‌’ టీజర్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ మన దగ్గర మాత్రం కాదు!

ఆసుస్‌ రాగ్‌ ఫోన్‌ 9లో 16 జీబీ+512 జీబీ స్టోరేజీని అందించనున్నారు. ఈ ఫోన్ ధర దాదాపుగా లక్ష ఉండనుంది. ప్రతి కొత్త మోడల్‌ ధరలను ఆసుస్‌ పెంచుతున్న విషయం తెలిసిందే. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. 65 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది.

Show comments