Site icon NTV Telugu

Asus Chromebook CX14: ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్ విడుదల.. స్మార్ట్ ఫోన్ ధరకన్న తక్కువకే!

Lap

Lap

ఆసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. భారత్ లో Asus Chromebook CX14 విడుదలైంది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల పూర్తి HD+ IPS డిస్ప్లే, 180-డిగ్రీల ‘లే-ఫ్లాట్’ హింజ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ N4500 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వరకు RAM, eMMC ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో జత చేశారు. Chromebook CX14 మన్నిక కోసం MIL-STD-810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్, గూగుల్ అభివృద్ధి చేసిన టైటాన్ C సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉందని Asus పేర్కొంది.

Also Read:Kerala High Court: “జానకి” ఉంటే తప్పేంటి.. అనుపమ పరమేశ్వరన్ సినిమాపై వివాదం..

భారత్ లో ఆసుస్ క్రోమ్‌బుక్ CX14 ధర TN (ట్విస్టెడ్ నెమాటిక్) LCD స్క్రీన్ కలిగిన మోడల్ రూ. 18,990 నుంచి ప్రారంభమవుతుంది. క్రోమ్‌బుక్ CX14 IPS వేరియంట్ ధర రూ. 20,990 గా నిర్ణయించింది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఆసుస్ క్రోమ్‌బుక్ CX14 కొనుగోలుపై కొనుగోలుదారులు 100GB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా పొందుతారు. బెస్ట్ క్వాలిటీ కోసం ఆసుస్ దీనిని MIL-STD-810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌తో, అనధికార యాక్సెస్‌ను నిరోధించడానికి, సైబర్ దాడుల నుంచి రక్షణను అందించడానికి టైటాన్ C సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది.

Also Read:Gujarat High Court: టాయిలెట్‌లో కూర్చుని వర్చువల్ విచారణకు హాజరైన యువకుడు.. వీడియో వైరల్

ల్యాప్‌టాప్‌లో 1.35mm కీ ట్రావెల్‌తో పూర్తి-పరిమాణ చిక్లెట్ కీబోర్డ్ కూడా ఉంది. Asus Chromebook CX14 లోని కనెక్టివిటీ ఆప్షన్స్ లో Wi-Fi 6, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. I/O పోర్ట్‌ల విషయానికొస్తే, ల్యాప్‌టాప్‌లో డిస్ప్లేపోర్ట్ 1.2 సపోర్ట్‌తో USB 3.2 Gen 1 టైప్-C పోర్ట్, HDMI 1.4, USB 3.2 Gen 1 టైప్-A పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, కెన్సింగ్టన్ లాక్ ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ మైక్రోఫోన్‌లు, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో డ్యూయల్ 2W స్పీకర్‌లను కలిగి ఉంది. Chromebook CX14 42Wh బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది.

Exit mobile version