NTV Telugu Site icon

Sunita Williams: అంతరిక్షంలోకి చేరుకోగానే ఆనందంతో చిందులేసిన వ్యోమగామి విలియమ్స్

New Project (63)

New Project (63)

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్‌తో కూడిన బోయింగ్ స్టార్‌లైనర్ గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) సురక్షితంగా చేరుకుంది. 59 ఏళ్ల వ్యోమగామి తన తొలి మిషన్‌లో అనుభవం లేని నూతన సిబ్బందితో అంతరిక్ష నౌకను ఎగుర వేసి పరీక్షించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. గతంలో గణేశ విగ్రహాన్ని, భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. సునీతా విలియమ్స్ తన మూడో ప్రయాణం కోసం మళ్లీ ISSకి చేరుకున్నారు. ఆమె అంతరిక్ష కేంద్రానికి రాగానే అక్కడున్న సిబ్బంది గంట కొట్టి ఆమెకు స్వాగతం పలికారు. సంతోషంతో విలియమ్స్ అంతరిక్షంలో చిందులేశారు. ISSలో ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను కౌగిలించుకున్నారు. స్వాగతం పలికిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

READ MORE: Shoaib Akhtar:”1999 ప్రపంచ కప్ చరిత్రను పాకిస్తాన్ జట్టు మరోసారి పునారావృతం చేసింది”

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతకు అక్కడున్న సిబ్బంది బెల్ మోగించి స్వాగతం పలికారు. ఇది ISS యొక్క దీర్ఘకాల సంప్రదాయంగా కొనసాగుతోంది. తన “డ్యాన్స్” గురించి సునీత మాట్లాడుతూ.. “ఇది ముందుకు సాగడానికి మార్గం. తన సిబ్బంది.. మరొక కుటుంబం” అని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన బోయింగ్ అంతరిక్ష నౌక 26 గంటల తర్వాత విజయవంతంగా డాక్ చేయబడింది. ఇద్దరు NASA వ్యోమగాములు స్టార్‌లైనర్‌ను పర్యవేక్షించారు. డాకింగ్‌కు ముందు అంతరిక్ష నౌకను కక్ష్యలో ఉన్న ప్రయోగశాలకు దగ్గరగా తీసుకురావడానికి ఇది వరుస విన్యాసాలు చేసింది. చిన్నపాటి హీలియం లీకేజీలు వంటి సాంకేతిక లోపాల కారణంగా డాకింగ్ దాదాపు గంట ఆలస్యం అయింది. ISSకి వెళ్లే మార్గంలో, సిబ్బంది స్టార్‌లైనర్‌ను మొదటిసారి అంతరిక్షంలోకి మానవీయంగా ఎగురవేయడంతోపాటు అనేక పరీక్షలను పూర్తి చేశారు. వారు ఒక వారం పాటు అంతరిక్షంలో గడిపి వివిధ పరీక్షలలో సహాయం చేస్తారు. శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు.

Show comments