NTV Telugu Site icon

Apophis : భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఏ రోజున రాబోతుందంటే ?

New Project (77)

New Project (77)

Apophis : ఆకాశం నుంచి అహ్మదాబాద్ నగరంలోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంత ఆస్టరాయిడ్ భూమి వైపు దూసుకొస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ గ్రహశకలాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని సంస్థ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఇది 2029లో భూమికి అత్యంత సమీపంలోకి వెళుతుందని, ఈ గ్రహశకలం పేరు అపోఫిస్ అని తెలిపారు. మరోవైపు ఈ గ్రహశకలం వల్ల భూమికి ముప్పు వాటిల్లకుండా చేసేందుకు అన్ని దేశాలు ముందుకు వచ్చాయని వాటికి భారత్ పూర్తి సహకారం అందిస్తామని సోమనాథ్ తెలిపారు.

Read Also:Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..

అపోఫిస్ గ్రహశకలం భూమికి 32,000 కి.మీ ఎత్తులో వెళుతుందని, అంటే భారత భూస్థిర ఉపగ్రహాల కక్ష్యల కంటే దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇంకా పరిమాణం పరంగా, ఇంత పెద్ద గ్రహశకలం గతంలో భూమికి ఇంత దగ్గరగా వెళ్లలేదని వివరించారు. ఇది భారతదేశపు అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని చెబుతారు. ఈ గ్రహశకలం పరిమాణం దాదాపు 340 – 450 మీటర్ల వ్యాసంలో ఉంటుందని చెప్పారు. భూమికి సమీపంలో ఉన్న ఏదైనా గ్రహశకలం వ్యాసంలో 140 మీటర్ల కంటే పెద్దదిగా పరిగణించబడుతుందని సోమనాథ్ చెప్పారు.

Read Also:iPhone Prices Drop: భారీగా తగ్గిన ‘ఐఫోన్‌’ ధరలు.. లేటెస్ట్‌ రేట్స్ ఇవే!

భారీ గ్రహశకలం మానవాళి మనుగడకు ముప్పు అని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో ఇస్రో చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ‘అపోఫిస్’ అనే గ్రహశకలాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో భూమికి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఈ విషయంలో అన్ని దేశాలకు సహకారం అందిస్తామని సోమనాథ్ తెలిపారు. గ్రహశకలం 300 మీటర్ల కంటే పెద్దదైతే ఖండాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలాలు ఢీకొంటే భూమి నాశనమైపోతుందని తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అపోఫిస్‌ను మొదటిసారిగా 2004లో గుర్తించారు. ఈజిప్షియన్లు సామ్రాజ్యాల సృష్టికర్తగా విశ్వసించే దేవుడు ‘అపోఫిస్’ పేరు మీద ఈ గ్రహశకలం పేరు పెట్టారు.

Show comments