హిట్ అండ్ రన్ కేసులపై కొత్త శిక్షాస్మృతిని వ్యతిరేకిస్తూ ఇవాళ్టి నుంచి 48 గంటల సమ్మెకు అస్సాం ట్రాన్స్‌పోర్టర్ యూనియన్లు పిలుపునిచ్చింది. దీని కారణంగా అస్సాంలో అన్ని వాణిజ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. సమ్మెకు సంబంధించి, బస్సులు, క్యాబ్‌లతో పాటు ఆటోలు, గూడ్స్ క్యారియర్లు, ఇంధన ట్యాంకర్లతో సహా అనేక ప్రజా రవాణా సంఘాలు చేతులు కలిపి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.
Read Also: Jasprit Bumrah: నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది!
కాగా, అస్సాం మోటార్ వర్కర్స్ అసోసియేషన్ ఉమ్మడి వేదిక కన్వీనర్ రామన్ దాస్ మాట్లాడుతూ.. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా డ్రైవర్లను మాత్రమే నిందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పేద డ్రైవర్లు శిక్షించబడుతున్నారు.. ఏ డ్రైవరూ ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి కారణం కాదని, చాలాసార్లు ప్రమాదానికి గురైన ఇతరుల తప్పిదమేనని ఆయన అన్నారు. హిట్ అండ్ రన్ కేసులపై కొత్త చట్టం డ్రైవర్ వ్యతిరేక, వాహనాల యజమానులకు వ్యతిరేకంగా ఉందని అతడు పేర్కొన్నారు. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేస్తూ.. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు అన్ని వాహనాల సమ్మెలో పాల్గొంటాయని చెప్పుకొచ్చారు.
Read Also: Gun Firing: అమెరికాలో కాల్పుల కలకలం.. తుఫాకీతో కాల్చి చంపిన టీనేజర్..
భారతీయ శిక్షాస్మృతి (IPC) స్థానంలో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ (BNS) ప్రకారం, ర్యాష్ డ్రైవింగ్ ద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.. దీంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించవచ్చు అని ఆ చట్టంలో ఉంది. బ్రిటీష్ కాలం నాటి ఐపీసీలో ఇలాంటి నేరాలకు రెండేళ్ల శిక్ష ఉండేది. కమర్షియల్ వాహనమైనా, చిన్న కారు అయినా ప్రతి ఒక్కరికీ చట్టం వర్తిస్తుంది.. కాబట్టి సమ్మెలో ప్రైవేట్ కార్ల యజమానులు కూడా పాల్గొనవల్సిందిగా ట్రాన్స్‌పోర్టర్స్ ఫోరం కోరింది.