అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వైద్యుడు యువకుడి జీవితం నాశనం చేశాడు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లితే వైద్యుడు తన అనుమతి లేకుండా జననాంగాలను తొలగించారని రోగి ఆరోపించారు. బాధితుడి వయసు కేవలం 28 ఏళ్లు కావడం ఆందోళన కరంగా మారింది. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాకు చెందిన అతికూర్ రెహమాన్ సిల్చార్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. రోగి జననేంద్రియ ఇన్ఫెక్షన్ బాధితుడు. పరీక్షించిన వైద్యుడు బయాప్సీ పరీక్ష నిర్వహించాడు. బయాప్సీ సమయంలో తన అనుమతి లేకుండా శస్త్రచికిత్స ద్వారా తన జననాంగాలను తొలగించాడని రోగి గ్రహించాడు. బాధితుడు రెహమాన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది స్పందించడం లేదు. చికిత్స చేసిన వైద్యుడు కూడా కనిపించడం లేదు.
READ MORE: WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
“జూన్ 19న, నా జననాంగాలలో ఇన్ఫెక్షన్ రావడంతో నేను సిల్చార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. బయాప్సీ పరీక్ష కోసం వెళ్లమని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు. నా బయాప్సీ పరీక్ష సమయంలో ఓ వైద్యుడు నా అనుమతి లేకుండా శస్త్రచికిత్స చేసి నా జననాంగాలను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత నేను మేల్కొని చూశాను. నా జననాంగాలను తొలగించినట్లు నాకు తెలిసింది. నా పర్మిషన్ లేకుండా ఎందుకు తొలగించారని వైద్యుడిని ప్రశ్నించాను. ఆయన సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇక నా జీవితం ముగిసింది. నేను మానసికంగా ఆవేదన చెందుతున్నాను.” అని అతికూర్ రెహమాన్ ఆరోపించారు.
READ MORE: Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు ఈసీ బిగ్ షాక్..
