NTV Telugu Site icon

Historic Peace Deal: కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. అమిత్ షా సమక్షంలో సంతకం

Ulfa

Ulfa

Assam separatist group ULFA signs peace deal with government, Amit Shah present: యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్‌మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది. ఉల్ఫా అనేది అస్సాంలోని అతి పురాతన తిరుగుబాటు గ్రూపు. శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. అసోం భవిష్యత్తుకు ఈరోజు ఉజ్వలమైన రోజు కావడం నాకు సంతోషకరమైన విషయమని, చాలా కాలంగా అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయన్నారు. ఉల్ఫా మెమోరాండమ్‌పై సంతకం చేయడం మొత్తం ఈశాన్య ప్రాంతాలకు, ముఖ్యంగా అస్సాంకు శాంతి యొక్క కొత్త కాలం ప్రారంభాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. 2014లో మోదీ తర్వాత ప్రధాని మోదీ ప్రధానమంత్రి అయ్యాక,, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు.

Read Also: Russia-Ukraine War: ఒక్కరాత్రిలో 122 క్షిపణులు, 36 డ్రోన్లు!.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

అరబింద రాజ్‌ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా బృందం, ప్రభుత్వం మధ్య 12 సంవత్సరాల బేషరతు చర్చల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ శాంతి ఒప్పందం అస్సాంలో దశాబ్దాల నాటి తిరుగుబాటుకు తెరపడుతుందని భావిస్తున్నారు. రాజ్‌ఖోవా వర్గం సెప్టెంబర్ 3, 2011న ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (SOO) ఒప్పందం సంతకం చేయబడింది.

1990లో నిషేధించబడింది..
అయితే, పరేష్ బారుహ్ నేతృత్వంలోని ఉల్ఫా యొక్క కరడుగట్టిన వర్గం ఒప్పందంలో భాగం కాదు. చైనా-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో బారువా నివసిస్తున్నట్లు సమాచారం. సార్వభౌమ అస్సాం డిమాండ్‌తో 1979లో ఉల్ఫా ఏర్పడింది. అప్పటి నుండి ఇది అనేక విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంది, దీని కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధిత సంస్థగా ప్రకటించింది.