NTV Telugu Site icon

Rahul Gandhi: భారత్‌ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసులు భారత్‌ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ పై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ నుంచి రాహుల్‌ నేతృత్వంలో స్టార్ట్ చేసిన ఈ యాత్ర నిన్న అస్సాంకు చేరుకుంది.

Read Also: Kriti Sanon: బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న కృతి సనన్…

ఇక, న్యాయయాత్ర జోర్హాట్‌ పట్టణం చేరుకుంది. ఆ సమయంలో పోలీసులు చూపించిన మార్గంలో కాకుండా నిర్వాహకులు మరోవైపు వెళ్లారని తెలిపారు. ఈ మార్పు పట్టణంలో తీవ్ర అంతరాయాలకు దారి తీసిందని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్‌ బారికేడ్లను తొలగించేలా, పోలీసులపై దాడి చేసేలా ప్రజలను నేతలు రెచ్చగొట్టారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో యాత్ర నిర్వాహకులపై ఈ కేసు నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తప్పబట్టింది. ఇదంతా న్యాయ్ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాకు ఇరుకైన మార్గం కేటాయించి.. అలాగే, ఆ రూట్ లో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కొద్ది దూరం పక్క మార్గంలో ప్రయాణించామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..

అయితే, మొదటి రోజు అస్సాంలో యాత్ర విజయంతంగా కొనసాగడంతో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర 67 రోజుల పాటు కొనసాగనుంది. దాదాపు 15 రాష్ట్రాలు 100 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర కొనసాగనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్‌ పట్టణంలో ప్రారంభమైన ఈ యాత్ర.. దాదాపు 6, 713 కిలో మీటర్ల మేర జరగనుంది. ఇది ఇవాళ్టికి ఆరో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు భారత్ జోడో న్యాయ్ యాత్రకు తరలి వచ్చారు.

Show comments