NTV Telugu Site icon

Currency notes: ఈ నేత ఎంత దోచుకున్నాడో..! నెట్టింట ఫొటో వైరల్

Money

Money

రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చాక.. డబ్బు సంపాదనే ధ్యేయంగా దోచుకుంటారని వింటుంటాం. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు.. అధికారంలోకి వచ్చాక ఆయా రూపాల్లో దోచుకుంటుంటారని చెబుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ లీడర్ ఎంత సంపాదించాడో తెలియదు గానీ.. అతడి యొక్క నిజస్వారూపాన్ని బయటపెట్టాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఎంత దోచుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. మంచంపై కరెన్సీ నోట్ల మధ్య నిద్రించిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అస్సాంలోని ఉదాల్‌గిరి జిల్లాకు చెందిన బెంజామిన్‌ బసుమతారీ అనే నేత కరెన్సీ నోట్లపై నిద్రించిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచంపై మొత్తం రూ.500 నోటులే ఉన్నాయి.

బెంజామిన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పథకాల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Bank Holidays : ఏప్రిల్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

ఫొటో వైరల్‌ కావడంతో యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో ఎక్స్‌ వేదికగా స్పష్టత ఇచ్చారు. బెంజామిన్‌కు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 10నే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 10నే వీసీడీసీ ఛైర్మన్‌ పదవి నుంచి కూడా తొలగించినట్లు చెప్పారు. ఆయన చర్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Samantha: చరణ్‌కు విషెష్ చెప్పిన సామ్.. కొత్త అనుమానం రేపిందేంటి?