Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి ఎంపీ అబ్దుల్ ఖలీక్ గుడ్‌బై

Resign

Resign

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు హస్తం పార్టీని వీడారు. తాజాగా మరో ఎంపీ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు.

అస్సాం కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. రిజైన్ చేసిన విషయాన్ని ట్విట్టర్‌లో ఆయన తెలియజేశారు. కాంగ్రెస్‌తో ఉన్న 25 ఏళ్ల బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పంపినట్లు వెల్లడించారు.

అస్సాంలోని బార్‌పేట నియోజకవర్గం నుంచి ఈసారి ఖలేక్‌కు టికెట్ లభించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం బాగోలేదని.. దీనికి రాష్ట్ర కాంగ్రెస్సే కారణమని ఆయన ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కోల్పోయిందని విమర్శించారు.

ఇదిలా ఉంటే శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇదిలా ఉంటే రెండు విడతలుగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో 39 మంది, సెకండ్ విడతలో 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది. త్వరలో మూడో జాబితాను విడుదల చేయనుంది. ఇందుకోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

 

 

Exit mobile version