మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు దుండగులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అత్యాచారానికి గురైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిన్న కుల్చారంలో అత్యాచారం అనంతరం వివస్త్రని చేసి మహిళను బండ రాయికి కట్టేసి పారిపోయారు దుండగులు.
Also Read:Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి ఏమైందంటే..?
అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళ ఆరోగ్యం విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో నర్సాపూర్ వద్ద మృతిచెందింది. మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
