Andhra Pradesh: ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు రాగా.. వారికి పోస్టింగులు కూడా కేటాయించారు. ఏఎస్పీలుగా ఉన్న ఏడుగురికి నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు లభించాయి. ఎం కృష్ణమూర్తి నాయుడు, శోభా మంజరి, బి ప్రసాద రావు, వర్మ, సోమశేఖర్ రావు, కేవీఆర్కే ప్రసాద్, రాజశేఖర్ రావుకు పదోన్నతులు లభించాయి. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా ఎం కృష్ణమూర్తి నాయుడికి పదోన్నతి లభించింది.
Read Also: CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన.. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ముఖ్యమంత్రి
ఆర్టీసీ ఎస్పీగా శోభా మంజరి, విజిలెన్స్ ఎస్పీగా ప్రసాద రావు, మెరైన్ ఎస్పీగా వర్మ, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా సోమశేఖర్ రావు, ఏపీ ట్రాన్స్‌కో విశాఖ ఎస్పీగా కేవీఆర్కే ప్రసాద్, ఏసీబీ ఎస్పీగా రాజశేఖర్ రావు, సీఐడీ ఎస్పీగా చక్రవర్తి పదోన్నతులు పొందారు. 32 మంది డీఎస్పీలకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా ప్రమోషన్లు లభించాయి. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్. ఉత్తర్వులు జారీ చేశారు.