Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్‌లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్ (2026)లో భారత జూడో క్రీడాకారిణి అస్మితా దే కొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడో పోటీలలో భారత్‌కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అస్మితా కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్ను ఓడించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంతో జాగ్రత్తగా ఆడారు. ఒక దశలో కెనడా క్రీడాకారిణి ‘యూకో’ పాయింట్‌తో ఆధిక్యం సాధించినప్పటికీ, అస్మితా వెంటనే పుంజుకుని ప్రతిగా ‘యూకో’ పాయింట్ సాధించి 1-1తో సమానం చేశారు.
నిర్ణీత సమయంలో ఇరు ప్రతినిధులు సమవుజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ ‘గోల్డెన్ స్కోర్’ (సడన్ డెత్) కు దారితీసింది. ఒత్తిడిని జయించిన అస్మితా, సరైన సమయానికి అత్యంత ప్రతిభావంతమైన ‘యూకో’ పాయింట్‌ను సాధించి భారత్ కలల స్వర్ణాన్ని ఖాయం చేశారు. ఈ గెలుపుతో కామన్వెల్త్ గేమ్స్ జూడో చరిత్రలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా అస్మిత నిలిచారు. ఆమె చూపిన ప్రతిభ, ఆత్మవిశ్వాసం దేశానికి గర్వకారణంగా మారాయి. అంతే కాకుండా.. 60 కిలోల పురుషుల జూడో విభాగంలో హర్షసింగ్ కూడా స్వర్ణం సాధించారు. దీంతో పతకాల సంఖ్య 19కి చేరింది.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల విషయానికి వస్తే.. స్వర్ణ పతకాల్లో.. అస్మితా డే (జూడో), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), షర్మిల ధాన్కర్ (పారా అథ్లెటిక్స్), దిలీప్ మహదు గావిత్ (పారా అథ్లెటిక్స్), హర్షసింగ్(జూడో).
రజత పతకాల విషయానికి వస్తే.. రిషికాంత సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్), సర్వేష్ కుషారే, గుల్వీర్ సింగ్, ఎం. శ్రీశంకర్ (అథ్లెటిక్స్).
కాంస్య పతకాల విషయానికి వస్తే.. సీమా కలిరామ్నా, బింద్యారాణి దేవి, శిల్ప కె. షైలా, ఝండూ కుమార్ సాధించారు. ప్రస్తుతం ఇండియా 5 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 19 పతకాలు సాధించి 8వ స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!