Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi OTT: మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకెళ్తోంది. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించడానికి వచ్చేస్తోంది. మరి ఈ మూవీని ఎప్పుడు? ఎక్కడ ? చూడచ్చో తెలుసుకుందాం పదండి.
మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇరుముడి’ (Irumudi) 2026 సెప్టెంబర్ 18 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix లో డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతోంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది. థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగుతున్నప్పటికీ, ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల గడువు పూర్తికాగానే దీనిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, దీనిని తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, దీ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు లేదా మళ్లీ చూడాలనుకునే హోమ్ ఆడియన్స్ కోసం సెప్టెంబర్ 18 నుండి ఇది స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర ఆయన కుమార్తె పాత్రలో కనిపించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్, తండ్రీకూతుళ్ల బంధం, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలను కలిపి రూపొందించిన ఈ కథ డిజిటల్ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 18న ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో నిలవడం ఖాయం అంటున్నారు సినిమా చూసినోళ్ళు.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!