Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?

  • ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌..
  • భారత్ 169/7 పరుగులు
  • ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు
  • ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌..
India

India

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 3 బంతుల్లో 7 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. అలాగే సంజూ శాంసన్ 9 బంతుల్లో 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశారు.

అయితే భారత ఇన్నింగ్స్‌ను ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 3 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్‌ 169 పరుగులకు చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో సహన్ అరచ్చిగె 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే తరిందు రత్నాయకె 2 వికెట్లు పడగొట్టగా, వనుజ సహన్, లసిత్ క్రూస్‌పుల్లె చెరో వికెట్ సాధించారు.

ఇప్పుడు శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులు చేస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ సెమీఫైనల్ విజేత ఇప్పటికే ఫైనల్‌లో చోటు దక్కించుకున్న పాకిస్థాన్‌తో స్వర్ణ పతకం కోసం తలపడనుంది. ఒకవేళ ఓడిపోతే బంగ్లాదేశ్ తో కాంస్య పతకం కోసం పోరాడాల్సి వస్తుంది.