IND vs NEP: యశస్వి జైస్వాల్ సెంచరీ.. నేపాల్‌కు భారీ టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Century, Rinku Singh 37 Runs Help India set 203 Target to Nepal: ఆసియా గేమ్స్ 2023లో భాగంగా హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో భారత్, నేపాల్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. భారత్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. యశస్వి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగాడు. మరోవైపు రుతురాజ్ కూడా చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నేపాల్ బౌలర్లను ఓ ఆటాడుకున్న యశస్వి.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. రుతురాజ్, యశస్వి జోరుతో 10వ ఓవర్ మొదటి బంతికే భారత్ స్కోర్ 100కి చేరింది.
Also Read
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
10వ ఓవర్ ఐదవ బంతికి రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. గైక్వాడ్ అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (2), జితేష్ శర్మ (5)లు నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరలో శివమ్ దూబె (25), రింకూ సింగ్ (37) చెలరేగారు. 15 బంతులు ఎదుర్కొన్న రింకూ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో విజృంభించాడు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, సందీప్ చెరో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!