NTV Telugu Site icon

IND vs NEP: యశస్వి జైస్వాల్‌ సెంచరీ.. నేపాల్‌కు భారీ టార్గెట్‌!

Yashasvi Jaiswal Century 2

Yashasvi Jaiswal Century 2

Yashasvi Jaiswal Century, Rinku Singh 37 Runs Help India set 203 Target to Nepal: ఆసియా గేమ్స్ 2023లో భాగంగా హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో భారత్‌, నేపాల్‌ మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌ పూర్తయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నేపాల్‌ బౌలర్లలో దిపేంద్ర సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌ బరిలోకి దిగారు. భారత్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. యశస్వి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగాడు. మరోవైపు రుతురాజ్‌ కూడా చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నేపాల్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న యశస్వి.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. రుతురాజ్‌, యశస్వి జోరుతో 10వ ఓవర్ మొదటి బంతికే భారత్ స్కోర్ 100కి చేరింది.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

10వ ఓవర్ ఐదవ బంతికి రుతురాజ్‌ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. గైక్వాడ్ అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (2), జితేష్ శర్మ (5)లు నిరాశపరిచారు. ఇన్నింగ్స్‌ చివరలో శివమ్‌ దూబె (25), రింకూ సింగ్‌ (37) చెలరేగారు. 15 బంతులు ఎదుర్కొన్న రింకూ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో విజృంభించాడు. నేపాల్‌ బౌలర్లలో దిపేంద్ర సింగ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్‌, సందీప్‌ చెరో వికెట్‌ తీశారు.