Site icon NTV Telugu

Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్‌ బ్యాటర్!

Dunith Wellalage Father

Dunith Wellalage Father

ఆసియా కప్‌ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్‌మెంట్‌కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తండ్రి మరణవార్త తెలియకముందే.. దునిత్ వెల్లలాగేకు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. అఫ్గాన్‌ బ్యాటర్ మహమ్మద్ నబీ అతడి బౌలింగ్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్‌ దునిత్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది.. అఫ్గాన్‌కు ఊహించని స్కోరు అందించాడు. 20 ఓవర్లలో అఫ్గాన్‌ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అయితే లక్ష్యాన్ని శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్‌ మెండిస్ (74) హాఫ్ సెంచరీ చేయగా.. కుశాల్‌ పెరీరా (28), కమిందు మెండిస్‌ (26 నాటౌట్‌) రాణించారు.

Also Read: Kokapet Murder: కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య!

మ్యాచ్‌ ముగిసిన అనంతరం హోటల్ రూమ్‌కు వెళ్లే క్రమంలో ఓ రిపోర్టర్ దునిత్ వెల్లలాగే తండ్రి చనిపోయాడనే విషయాన్ని మహమ్మద్ నబీకి చెప్పాడు. విషయం తెలిసి నబీ షాక్‌కు గురయ్యాడు. ఆపై తన సంతాపాన్ని తెలియజేశాడు. హార్ట్‌ ఎటాక్‌తో? చనిపోయాడా?.. నిజంగానా? అంటూ నబీ ఇచ్చిన షాకింగ్‌ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. దునిత్ శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 31 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 46 వికెట్స్ పడగొట్టాడు.

Exit mobile version